ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పెద్ద శుభవార్త అందించింది. డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్‌లో అత్యంత కీలకమైన ప్రకటన – ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం ప్రారంభం. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా కవరేజ్ అందించనున్నారు. ఈ పథకం జూన్ 2, 2026 నుండి అమలు కానుండగా, దీనికి ₹4,000 కోట్లు కేటాయించారు.
విద్య రంగంలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ఆధునిక సౌకర్యాలతో విద్య అందించడానికి ₹500 కోట్లు కేటాయించారు.
అలాగే 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించనున్నారు. పాలు, రాగి మాల్ట్ సహా పోషకాహారం అందించడానికి ₹800 కోట్లు కేటాయించారు.
చేయూత పథకం కింద మరో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. మరిన్ని వార్తల కోసం Aaditya News చదవండి.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad