IND vs PAK: భారత్ మ్యాచ్‌కు ముందు పాక్ షాకింగ్ నిర్ణయం!

National Sports Trending News

Asia Cup 2025, IND vs PAK: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2025 సూపర్ 4లో భారత్‌తో తలపడే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టులో టెన్షన్ పెరిగింది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

తాజా సమాచారం ప్రకారం, పాకిస్తాన్ జట్టు మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రహీల్ అహ్మద్ ను నియమించుకుంది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఒత్తిడిని అధిగమించేందుకు ఆయన ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు.

భారత్‌పై పాకిస్తాన్ రికార్డు పెద్దగా మెరుగు కాదని తెలిసిందే. ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి అనేక టోర్నమెంట్లలో భారత్ చేతిలో ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో, భారత్‌ను ఓడించేందుకు మానసికంగా బలపడాలని పాక్ జట్టు ప్రయత్నిస్తోంది.

భారత్‌తో మ్యాచ్ ముందు PCB తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *